Saturday, January 21, 2017

పాతకాలంలో జపానులో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట.
అదేంటంటే...
వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని పోయి ఎతైన కొండప్రాంతాలలో వదిలి
వచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో
అలమటించి క్షీణించి చనిపోయేవారట.

ఒక యువకుడు కూడా తన తల్లి వయస్సుపైపడి చేతకాని స్థితిలో ఉందని
ఆమెను తన బుజాలపై మోసుకుని కొండల్లో వదలేసి రావడానికి
బయలు దేరాడు.
మార్గమధ్యలో తన బుజంపైనున్న తన తల్లి
ఏదో చేస్తున్నట్లు గమనించాడు.
చెట్టు కొమ్మలను,కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతూ
ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళుతున్నాడు .
చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుతిరుగుతూ

" నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను
తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు. అలా ఎందుకు చేశావో
చెప్పు" అన్నాడు.

దానికి ఆ తల్లి

" నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు
పరవాలేదు...మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం
నన్ను తీసుకుని వచ్చావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది
పడతావేమో అని భయంతో ఆ కొమ్మలను
తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను...ఆ గుర్తులతో జాగ్రత్తగా
ఇంటికెళ్లు నాయనా! అంది

"ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే". అమ్మతనానికి రూపాలుండవ్... అమ్మ నోటికి శాపాలుండవ్..మనసున్నదే అమ్మ ...మంచి కోరేదే అమ్మ"

నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.

No comments:

Post a Comment